వాల్ నట్స్తో అద్భుత ప్రయోజనాలు
Amazing benefits with walnuts: రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు, శరీరానికి పుష్కలంగా పోషకాలు అందేందుకు అంతా నట్స్ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇందులో బాదం, ఖర్జూరం, జీడిపప్పు, వాల్ నట్స్ వంటివి ఎన్నో మెరుగైన పోషకాలు కలిగి ఉంటాయని ఆహార నిపుణులు పేర్కొంటున్నారు. రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో అద్భుత ప్రయోజనాలను వాల్ నట్స్ కలిగి ఉంటాయని చెబుతున్నారు. రోజూ కేవలం 3 వాల్ నట్స్ తింటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వివరిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
డయాబెటిస్ అదుపులో ఉంచేందుకు, ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్కు వాల్ నట్స్ అద్బుత పరిష్కారమని తెలుస్తోంది. వీటిని నాన బెట్టి రోజూ 3 తింటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి, గుండె సమస్యలను దూరం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటంతో కేన్సర్ కణాల వృద్ధిని నిరోధిస్తాయి.
Amazing benefits with walnuts :
- మెదడు చురుగ్గా ఉండేందుకు దోహదపడతాయి.
- ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తగిన మోతాదులో లభిస్తాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది.
- ఇందులో క్యాల్షియం, ఐరన్, జింక్, పొటాషియం, కాపర్ ఉంటాయి. ఇవన్నీ శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తాయి.
- శరీరానికి అవసరమైన మేలైన ఫ్యాట్స్ వీటిలో లభిస్తాయి. దీంతో ఆకలిని తగ్గించి, తద్వారా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
- వీటిలో లభించే మెలటోనిన్ కారణంగా హాయిగా నిద్రకు ఉపక్రమించడానికి సాయపడతాయి.
- ఇందులో లభించే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్తో ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.
COMMENTS