Black Rice | బ్లాక్ రైస్ తిన్నారా ఎప్పుడైనా? ఇందులో ఉండే పోషకాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Black Rice: వైట్ రైస్ తెలుసు.. కానీ ఈ బ్లాక్ రైస్(నల్ల బియ్యం) ఏందబ్బా అంటారా? అందరూ తినేది వైట్ రైసే. కానీ.. దాంట్లో ఉండే పోషకాల కంటే కూడా బ్లాక్ రైస్‌లో చాలా పోషకాలు ఉంటాయి. అందుకే.. బ్లాక్ రైస్‌ను తింటే చాలా రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ బ్లాక్ రైస్ ఎక్కడ దొరుకుతుంది అంటారా? పదండి.. ఇంకాస్త వివరంగా బ్లాక్ రైస్ గురించి తెలుసుకుందాం.
గత రెండు మూడేళ్ల నుంచే దేశ వ్యాప్తంగా రైతులు బ్లాక్ రైస్ను పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల బ్లాక్ రైస్ను పండిస్తున్నారు. కాకపోతే.. చాలా తక్కువ ఎకరాల్లో ఈ పంటను ప్రస్తుతం పండిస్తున్నారు. అయితే.. కొన్ని కిరాణా, బియ్యం కొట్టుల్లో బ్లాక్ రైస్ను అమ్ముతున్నారు. కాకపోతే సాధారణ బియ్యం కన్నా.. బ్లాక్ రైస్ ధర మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది.ఉదాహరణకు.. వైట్
రైస్ 50 రూపాయలకు కిలో
ఉంటే.. బ్లాక్ రైస్
మాత్రం రూ.200 వరకు
కిలో ఉంటుంది. అందుకే..
చాలామంది ఈ బియ్యాన్ని
కొనేందుకు వెనుకడుగు
వేస్తున్నారు. కాకపోతే..
ఈ బియ్యంలో ఉండే
పోషకాల వల్ల.. ఈ
బియ్యాన్ని తింటే ఆరోగ్యపరంగా చాలా
లాభాలు ఉంటాయి.
Black Rice | బ్లాక్ రైస్‌లో ఉండే పోషకాలు ఏంటి?
బ్లాక్ రైస్ చూడటానికి నల్లగా ఉంటాయి. ఒక వంద గ్రాముల బ్లాక్ రైస్‌ను తీసుకుంటే.. అందులో 8.5 గ్రాముల ప్రొటీన్లు, 3.5 గ్రాముల ఐరన్, 4.9 గ్రాముల ఫైబర్, 8.5 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి. కోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు ఈ బియ్యం మంచి ఔషధంలా పనిచేస్తాయి. విటమిన్స్, ఖనిజాలు బ్లాక్ రైస్‌లో ఎక్కువగా ఉంటాయి. షుగర్‌తో పాటు క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా బ్లాక్ రైస్ నివారిస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాల వల్ల ఈ బియ్యాన్ని ఆయుర్వేద మందు తయారీలోనూ ఉపయోగిస్తారు.
మీకు ఇంకో విషయం తెలుసా? ఈ బ్లాక్ రైస్‌ను రైతులు రసాయనాలు వేసి పండించరు. సహజసిద్ధంగా పండిస్తారు. వీటికి రసాయనాల అవసరం లేకుండానే సేంద్రీయ ఎరువులతో వీటిని పండించడం వల్ల ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతాయి.
COMMENTS