వేసవిలో అందంగా కనిపించాలంటే.. కచ్చితంగా ఇవి మీ బ్యాగ్‌లో ఉండాల్సిందే..
Beauty Tips In Summer : వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. బయటకు వెళ్లినప్పుడు వచ్చే ట్యాన్ నుంచి కాపాడుకుంటూ... మనల్ని అందంగా చూపించే ఉత్పత్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ మండుటెండల్లో ఎలాంటివి ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో మేకప్ వేసుకోవడం అనేది చాలా ఇబ్బంది కలిగించే విషయం. చెమట కారణంగా మనం పడే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. ఎక్కువ మేకప్ వేసుకోవడం వల్ల.. ఎండ సమయంలో ఎక్కువ చెమట వచ్చే అవకాశం ఉంటుంది. అది జిడ్డు చర్మానికి దారి తీస్తుంది. మేకప్ బ్రేక్ అయి అది కచ్చితంగా ఆకర్షణీయంగా కనిపించదు. కానీ కొన్ని ఉత్పత్తులతో మీరు సమ్మర్‌లోనూ అందంగా కనిపించవచ్చు. బయటకు వెళ్లినప్పుడు మీతో పాటు వాటిని కూడా తీసుకెళ్లండి. మిమ్మల్ని సన్ నుంచి కాపాడుకుంటూ.. అందంగా ఉండండి. అయితే వేటిని మీతో కచ్చితంగా బయటకు తీసుకువెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సన్‌స్క్రీన్..
వేసవిలో మీ ముఖం, మీ శరీరంలోని ఎండకు బహిర్గత ప్రాంతాలపై సన్‌స్క్రీన్‌ను పూయకుండా ఇంటిని వదిలి వెళ్లకూడదు. దీనిని కచ్చితంగా ఫాలో అవ్వాలి. సన్‌స్క్రీన్ మిమ్మల్ని హానికరమైన యూవీ కిరణాల నుంచి మిమ్మల్ని, మీ శరీరాన్ని రక్షిస్తుంది. సన్బర్న్లు, హైపర్పిగ్మెంటేషన్, అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ఎస్పీఎఫ్ 30 కలిగిన సన్‌స్క్రీన్ వాడండి. మీ చర్మానికి సరిపోయే, తెల్లటి లేయర్‌ను వదిలివేయని వాటిని ఎంచుకోండి.
ఫేస్ మిస్ట్..
వేసవిలో ఫేస్ మిస్ట్‌లు తప్పనిసరిగా ఉండాల్సిన బ్యూటీ ప్రొడక్ట్. అవి మీ చర్మాన్ని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా.. మీ చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్‌గా మార్చుతాయి. మీకు అలసిపోయినప్పుడు లేదా వేడి ఎక్కువగా అనిపించినప్పుడు ప్రతిసారీ దాన్ని చల్లుకోండి. సొంతంగా ఫేషియల్ మిస్ట్‌ను తయారుచేసుకోవడానికి రోజ్ వాటర్‌కు కొద్దిగా గ్లిజరిన్, జోజోబా ఆయిల్‌తో కలపవచ్చు.
మాట్ న్యూడ్ లిప్‌స్టిక్
ఈ వేసవిలో ప్రకాశవంతమైన, మెరిసే పెప్పీ లిప్‌స్టిక్ షేడ్స్‌ని వదిలేయండి. మరింత సహజమైన, చిక్ లుక్ కోసం మాట్ న్యూడ్ లిప్ షేడ్స్‌ని ఎంచుకోండి. ఇవి చాలా తేలికగా ఉంటాయి. సులభంగా మసకబారవు. నాణ్యత కలిగిన వాటిని ఎంచుకోవడం ముఖ్యం. బడ్జెట్ లేకపోతే రెండు లేదా మూడు షేడ్స్‌కు మాత్రమే పెట్టుబడి పెట్టండి.
COMMENTS