జ్యూస్ లు ఏ టైమ్ లో తాగాలంటే?
At what time should the juices be drunk?: శరీర ఆరోగ్యం కోసం జ్యూస్ తాగేవారికి వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ విషయాలు తప్పకుండా పాటించాలని చెబుతున్నారు. శరీర పోషకాల కోసం చాలా మంది పండ్లు, కూరగాయలతో చేసిన జ్యూసులు తాగుతుంటారు. అయితే మార్కెట్లో లభించే ప్యాకెడ్ జ్యూసులు అస్సలు తీసుకోవద్దని వైద్యులు సలహాఇస్తున్నారు.
వీటిలో పండ్లకు బదులుగా ప్రిజర్వేటివ్లు, చక్కెర, పండ్ల రుచులు పెద్ద ఎత్తున మిక్స్ చేస్తారని అందువల్ల ఇంట్లోనే తయారు చేసుకున్న జ్యూసులను తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే జ్యూస్ తయారు చేసి 20 నిమిషాల్లో తాగినప్పుడే వాటి పూర్తి ప్రయోజనాలు శరీరాని అందుతాయని సూచిస్తున్నారు. ఆలస్యం చేయడం ద్వారా అందులోని పోషకాలు నశిస్తాయి. ఉదయం పూట మళ్లీ రాత్రి 7 నుండి 8 గంటల మధ్య జ్యూస్ తాగడం మంచిదని , ఈ సమయాల్లో జ్యూస్ సేవించడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి పూర్తి స్థాయిలో అందుతుంని చెబుతున్నారు. అలాగే వ్యాయామం చేసిన అరగంట తర్వాత జ్యూస్ తాగితే శరీరానికి పోషకాలతో పాటు సహజ చక్కెర అందుతుంది.
COMMENTS