చల్లటి నీరు ఎక్కువగా తాగేవారికి అలర్ట్..సైడ్ ఎఫెక్ట్స్ ఇవే
Alert for those who drink a lot of cold water,These are the side effects : చలికాలం, ఎండాకాలం అని తేడా లేకుండా చాలా మంది చల్లటి నీరు తాగుతుంటారు. అయితే ఎక్కువగా చల్లటి నీరు తాగడం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. చల్లటి నీరు జీర్ణవ్యవస్థను వేగంగా ప్రభావితం చేస్తుంది. రోజూ చల్లటి నీటిని తాగితే జీర్ణ వ్యవస్థ వేగం మందగించి మీరు తిన్న ఆహారం అరగదు. చల్లటి నీరు వల్ల శరీర ఉష్ణగ్రతలో మార్పులు వచ్చి జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుంది.
అతిగా చల్లటి నీరు తాగడం వల్ల తలనొప్పి 'బ్రెయిన్ ఫ్రీజ్' సమస్య వస్తుంది. ముఖ్యంగా ఐస్ వాటర్ తాగే వారిలో ఈ సమస్యను ఎక్కువగా గుర్తించారు.
చల్లటి నీరు.. వెన్నెముక యొక్క సున్నితమైన నరాలను చల్లబరుస్తుంది, దీని కారణంగా ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. దీని ద్వారా తలనొప్పి, సైనస్ రావొచ్చు.ఎక్కువగా చల్లటి నీరు తాగడం వల్ల మన శరీరంలో మెడ ద్వారా గుండె, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థను నియంత్రించే నాడులు చల్లబడి హార్ట్ బీట్, పల్స్ రేట్ను తగ్గిస్థాయి.
చల్లటి నీరు తాగడం వల్ల ఉష్ణగ్రతలో మార్పు వచ్చి శరీరంలో కొవ్వు కరగదు. దీంతో బరువు పెరిగే అవకాశం ఉంది. మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే, చల్లని నీటికి దూరంగా ఉండండి.
COMMENTS