ప్రతి రోజు రూ.30 పొదుపుతో 70 వేలు అందించే స్కీమ్!
A scheme that offers 70 thousand Rs with a saving of Rs.30 every day: పోస్టాఫీస్‌లో పలు రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి ఉంది. పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్‌లో ప్రతి నెలా మీకు నచ్చినంత డబ్బును ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లొచ్చు. కనీసం రూ.100 నుంచి డిపాజిట్ చేసే సదుపాయం ఉంది. పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్‌పై మూడు నెలలకు ఒకసారి వడ్డీ డబ్బులు మీ అకౌంట్లో జమవుతాయి. ఐదేళ్ల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. అంటే పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్‌లో ఐదేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది.
ఉదాహరణకు మీరు ప్రతి నెలా రూ.1,000 ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం మీరు రోజుకు దాదాపు రూ.30 ఆదా చేయాలి. ఈ డబ్బును నెల చివరిలో పోస్టాఫీస్ ఆర్డీలో డిపాజిట్ చేయాలి. ఇలా చేస్తే.. మీకు చేతికి రూ.70,000 లభిస్తాయి. అంతేకాకుండా పోస్టాఫీస్ ఆర్డీపై టీడీఎస్ కూడా పడదు. డబ్బులు అవసరం అనుకుంటే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ప్రారంభించిన ఏడాది తర్వాత డబ్బులు 50 శాతం వరకు వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఇలా డబ్బులు తీసుకోవడం వల్ల కాంపౌండింగ్ బెనిఫిట్ కోల్పోతారు. దీంతో మెచ్యూరిటీ సమయంలో మీకు తక్కువ డబ్బులు చేతికి వస్తాయి.
COMMENTS