రోజుకు రూ.7తో ప్రతి నెల 5వేలు అందించే స్కీమ్!
A scheme that offers 5 thousand every month for Rs. 7 per day: ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువైపు నుండి ముప్పు ముంచుకు వస్తుందో ఊహించడం అసాధ్యమైపోయింది. కరోనా వంటి కష్టకాలంలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని గందరగోళం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ లో ఏర్పడబోయే ఆర్థిక అవసరాలకు బెంగ కలగక మానదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఓ చక్కటి స్కీమ్ లో అందుబాటులో ఉంచింది.
రాబోయే రోజుల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టేక్కించే ఈ స్కీమ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ పథకంలో చేరి పొదుపు చేస్తే 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా డబ్బులు వస్తాయి. ఆ పథకం వివరాలు ఏంటో చూద్దాం..
ఈ పథకం 2015 నుంచి అందుబాటులో ఉంది. అసంఘటిత రంగంలోని వారు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం అమలు చేస్తోంది. ఈ స్కీమ్ గురించి కొంత వరకు తెలిసినా చాలా మంది ఇంకా ఇందులో చేరలేదు. మన స్నేహితులు, బంధువులకు ఈ విషయం చెరవేయడం ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించుకునే అవకాశం ఉంటుంది. 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఈ స్కీమ్లో చేరడానికి అర్హులు. బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టాఫీస్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. ఈ పథకంలో చేరిన వారు ప్రతి నెలా కొంత మొత్తం ప్రీమియం రూపంలో చెల్లించాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా డబ్బులు అందజేస్తారు. రూ.5 వేల వరకు పొందొచ్చు.
ఈ పథకంలో చేరడం వల్ల నెలకు కనీసం రూ.1000, ఆపై రూ.2 వేలు, రూ.3 వేలు, రూ.4 వేలు, రూ.5 వేలు చొప్పున కూడా పెన్షన్ పొందే వెసులుబాటు ఉంటుంది. ప్రతి నెలా రూ.5 వేలు పెన్షన్ పొందాలని భావిస్తే గనుక మీరు ప్రతి నెల రూ.210 చెల్లించాలి. అంటే రోజుకు రూ.7 ఆదా చేస్తే సరిపోతుంది. వయసు పెరిగే కొద్ది చెల్లించాల్సిన నెలవారీ మొత్తం కూడా పెరుగుతుంది.
COMMENTS