చెప్పులు లేకుండా నడవడం వల్ల లాభాలివే
The benefits of walking barefoot : బీచ్ కి వెళ్ళినప్పుడో, ఏదైనా హిల్ స్టేషన్కి వెకేషన్కి వెళ్ళినప్పుడో, మొక్కలూ పువ్వులతో కళకళలాడుతున్న తోటలో తిరుగుతున్నప్పుడో ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. ఎందుకూ అంటే ఇలాంటప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటారు కదా. మనం ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటాం కదా. అలాంటి ఒక పనే చెప్పులు లేకుండా క్లీన్ గా ఉన్న నేల మీద, లేదా గడ్డి మీద నడవడం. ఈ చిన్న లైఫ్ స్టైల్ చేంజ్ ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు.
భూమి మీద నివసించే ప్రాణులన్నీ కూడా నేలతో కనెక్ట్ అయ్యే ఉంటాయి. మన లైఫ్ స్టైల్ ఇప్పుడు అలాంటి కాంటాక్ట్ ని పర్మిట్ చేయడంలేదు. మంచాల మీద పడుకుంటాం, డైనింగ్ టేబుల్ దగ్గర తింటాం, కుర్చీల్లో కూర్చుంటాం, నడిచినప్పుడు కూడా చెప్పులు, లేదా షూస్ వేసుకుని నడుస్తాం. దాంతో నేల తల్లి చల్లని స్పర్శని మనం మిస్ అవుతున్నాం. అందుకే మనలో చాలా మంది అంత ఆనందంగా అయితే జీవించడం లేదు. ఇవాళ ఇదే విషయాన్ని ఎన్నో సైంటిఫిక్ స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న రకరకాల అనారోగ్యాలకి కల కారణాలో మనిషి ప్రకృతి నించి విడిగా బతకడమే ప్రధానమయిన కారణం అని ఈ స్టడీస్ చెబుతున్నాయి. ఇలా నేల స్పర్శని అనుభవించడాన్ని గ్రౌండింగ్ అంటారు.
COMMENTS