జుట్టు, చర్మ సమస్యలకు చెక్ పెట్టండిలా !
Keep a check for hair and skin problems : వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం వల్ల చాలా మంది చర్మం, జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలను కొన్ని చిట్కాలతో దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చర్మం మెరుపు కోసం:
వెన్నకు గుడ్ల సొన కలిపి క్రీమ్‌లా తయారు చేసి ముఖానికి మర్దన చేయాలి. దీని వల్ల ముఖంలో గ్లో వస్తుంది.
మొటిమలు:
జాజికాయ పొడి, చందనం, మిరియాల పొడి సమపాళ్లలో కలిపి, ఈ మిశ్రమానికి పాలు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ముఖానికి రాసుకుంటే మొటిమల సమస్య తగ్గుతుంది.
చర్మ సమస్యలు:
ఉసిరికాయ పొడి, వేపాకు పొడికి నెయ్యి కలిపి తాగితే అలర్జీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉసిరికాయ పొడిని బెల్లం మిశ్రమం కూడా బాగా పనిచేస్తుంది. అల్లం రసం, బెల్లం మిశ్రమం కూడా ఫలితాన్నిస్తుంది.
for hair and skin problems:
చర్మ వ్యాధులు:వేప పొడి, హరాడ్ పొడి, ఉసిరికాయ పొడి మిశ్రమాన్ని నెలపాటు తీసుకుంటే అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గేందుకు సహాయపడుతుంది. వేప ఆకులు లేదా ఉసిరికాయ పడిగడుపున తినటం మంచిది.
ఆయిలీ స్కిన్ సమస్య:
కొబ్బరి పాలతో ముఖానికి మర్దన చేస్తే అది ముఖంపై జిడ్డును పోగొడుతుంది.
జుట్టు కోసం చిట్కాలు..
చుండ్రు సమస్య:
పాలలో గసగసాలు కలిపి ఒక హెయిర్ ప్యాక్ తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి కొంత సమయం ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చుండ్రు తొలగిపోతుంది.
జట్టు నెరవటం:
ముక్కు ద్వారా రెండు చుక్కల ఆవ నూనెను తీసుకోవాలి. ఇది మీ జుట్టు తెల్లబడటాన్ని తగ్గిస్తుంది.
రింగ్ వామ్: సల్ఫర్, సెసమీ నూనెను రాయటం వల్ల రింగ్ వామ్ సమస్య తగ్గుతుంది.
జుట్టు రాలటం: మందార పూలతో ఆవు మూత్రాన్ని కలిపి వాడటం వల్ల జుట్టు రాలటం తగ్గుతుంది.
COMMENTS