health:భుజం నొప్పి బాధిస్తోందా..
భుజం నొప్పి ఉంటే సాధారణ పనులేవీ సరిగా చేసుకోలేం.
కొన్నిసార్లు ఇతరుల సాయం కూడా తీసుకోవాల్సి వస్తుంది. కొవిడ్ వచ్చిన వారికి ఇలాంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. భుజం కీలు నొప్పిగా ఉండటంతో పాటు కొన్నిసార్లు పైకి ఎత్తడానికి కూడా వీలు కాదు..ఇలాంటి పరిస్థితిని అధికమించడానికి ఆయుర్వేదంలో పలు పరిష్కారమార్గాలున్నాయని ఆయుర్వేద ఫిజిషియన్ పెద్ది రమాదేవి చెబుతున్నారు.
భుజం నొప్పి ఎందుకు వస్తుంది: మధుమేహం, కార్జిలేజ్ అరిగిపోవడం, ప్రమాదాలు జరగడం, భుజం ఎముకల్లో ఇన్‌ఫెక్షన్ సోకినపుడు చేయి పైకి ఎత్తడం, పనులు చేయడం కష్టంగా ఉంటుంది. చివరికి ఏదైనా రాయాలనుకున్నా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
నివారణ ఎలా: భుజం నొప్పి వచ్చినపుడు మందులతో కాకుండా చిన్న చిన్న వ్యాయామాలతో తగ్గించుకోవచ్చు. చేతిని గోడకు పెట్టి లేపడం, టవల్‌తో వీపు భాగంవైపు కదలికలు తీసుకొని రావడంతో కాస్త ఉపశమనంగా ఉంటుంది. మధుమేహం ఉంటే ముందుగా దాన్ని నియంత్రించుకోవాలి. సూర్య నమస్కారాలు చేసినా ప్రయోజనకరంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడం అన్నింటి కంటే చాలా మంచిది.
- రెండు టేబుల్ స్పూన్ల పసుపునకు ఒక చెంచా కొబ్బరినూనె కలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో పూత లాగా పూయాలి.
- లావెండర్ నూనె గానీ ఒకటి, రెండు చెంచాల గోరు వెచ్చటి ఆలీవ్‌నూనెనుతో గానీ మర్దన చేయాలి.
- నువ్వుల నూనె మునగ, చింతాకు వేసి రాయాలి
- దశమూలల తైలం కూడా బాగా పని చేస్తుంది,
- చల్లని, వేడి నీటితో కాపడం పెడితే నొప్పి తగ్గిపోతుంది
COMMENTS