రోజ్ వాటర్తో ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం
అందంగా, ప్రకాశవంతంగా కనిపించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్‌లో దొరికే ఫేస్ క్రీములు, ఫేస్ మాస్కులు ఇలా అన్ని ఉపయోగిస్తుంటారు. కాని, ఎన్ని ఉపయోగించినా..
పొడి చర్మం, మోటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ ఇలా ఏదో ఒక చర్మ సమస్య మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే ఎలాంటి చర్మ సమస్యలు ఉన్నా.. రోజ్ వాటర్తో సులువుగా చెక్ పెట్టవచ్చు.
మరి రోజ్ వాటర్‌ను చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. రోజ్ వాటర్‌లో కొద్దిగా శెనగపిండి, పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి. అర గంట తర్వాత చల్లటినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మెటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి. మరియు ముఖం ప్రకాశవంతంగా కూడా మారుతుంది.
అలాగే ప్రతిరోజు రోజ్ వాటర్‌లో దూదిని ముంచి కళ్ల కింద అద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు మాయమవుతాయి. మరియు కళ్ల కింద ఉన్న చారలు తగ్గుముఖం పడతాయి. అదేవిదంగా, రోజ్‌వాటర్‌లో కాఫీ పౌడర్ మరియు కలబంద గుజ్జు కలిపి ముఖానికి అప్లూ చేయాలి.
అర గంట తర్వాత చల్లటినీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న మృత కణాలు తొలగడంతో పాటు మంచి టోన్ లభిస్తుంది. ఇక ప్రతిరోజు నిద్రించే ముందు ముఖానికి మరియు పెదవులకు రోజ్ వాటర్ అప్లై చేసి.. పడుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. ముఖంలో కొత్త కాంతి సంతరించుకుంటుంది.
COMMENTS